రామ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ‘ఎందుకంటే ప్రేమంట’

రామ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ‘ఎందుకంటే ప్రేమంట’

Published on Apr 10, 2012 2:44 PM IST


రామ్ మరియు తమన్నా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎందుకంటే ప్రేమంట ఈ వేసవిలో విడుదల కాబోతుంది. శ్రీ సవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 26 కోట్ల రూపాయల బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతుంది. దర్శకుడు కరుణాకరన్ మరియు సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ ఈ చిత్రాన్ని అందమైన దృశ్య కావ్యం లాగా తీర్చి దిద్దరాని సమాచారం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు.

తాజా వార్తలు