వచ్చే వారంనుండి గుర్రం మరోసారి ఎగురుతుందట

వచ్చే వారంనుండి గుర్రం మరోసారి ఎగురుతుందట

Published on Mar 9, 2013 1:13 PM IST

Emo-Gurram-Egara-Vachu
‘ఆ నలుగురు’తో మంచి పేరు తెచ్చుకున్న చంద్ర సిద్దార్ధ్ తాజా సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ లో సుమంత్ కధానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలయ్యింది. దాదాపు మొదటి షెడ్యూల్ అంతా రామోజీ ఫిలింసిటీలోనే షూట్ చేసారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ మర్చి 11 నుండి మొదలవుతుంది. పి. మదన్ ఈ సినిమాకి నిర్మాత . పింకీ సావికా ఈ సినిమాలో సుమంత్ సరసన నటిస్తుంది. ఈ సినిమా ఒక సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన ఎస్. ఎస్ కాంచి దీనికి కుడా స్క్రిప్ట్ అందించాడు. ఎం. ఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమా వేసవి చివర్లో విడుదల కావచ్చు.

తాజా వార్తలు