సస్పెన్స్ లో ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ విడుదల

సస్పెన్స్ లో ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ విడుదల

Published on Jan 24, 2014 2:00 PM IST

sumanth-ege
హీరో సుమంత్ నటించిన ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ సినిమా ఈ రోజు విడదల కావాల్సి ఉండేది. ఎందుకోతెలియదు కానీ ఈ సినిమాకి సంబందిచిన ఉదయం, మధ్యాహ్నం ఆటలు రద్దు చేయబడ్డాయి. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కుస్ సంబందిచిన ఫైనాన్షియల్ సమస్య ఇంకా క్లీయరెన్స్ కాలేదని తెలిసింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని త్వరలో దీనిపై నిర్ణయం వెలువడవచ్చు. కొంతమంది డిస్ట్రీబ్యూటర్స్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఒకరోజు తరువాత అనగా 25న విదుదలకావచ్చు. పింకి సవిక హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించాడు. ఎస్. ఎస్. కంచి స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా కు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.

తాజా వార్తలు