నాలుగు భాషల్లో రాబోతున్న ‘ఈగ’


అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఈగ’ చిత్రం నలుగు భాషల్లో తెరకెక్కుతోంది. మొదటగా తెలుగులో ‘ఈగ’ పేరుతో, తమిళ్లో ‘నాన్ ఈ’ పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈగ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతో పాటుగా హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నెల 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాని, సమంతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈగ చిత్రంలో సుదీప్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి నేపథ్య సంగీతం ఈ చిత్రానికి కీలకం కానుంది.

Exit mobile version