జూన్ లో ఈగ!

జూన్ లో ఈగ!

Published on Apr 10, 2012 8:25 AM IST


మాకు అందిన తాజా సమాచారం ప్రకారం “ఈగ” చిత్ర విడుదల మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ నెల మధ్యలో విడుదల కానుంది. సమంత,నాని మరియు సుదీప్ లు ప్రధాన తారలుగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ గ్రాఫిక్స్ ని కలిగి ఉంది. ఈ చిత్ర ఆలస్యానికి కారణం గ్రాఫిక్ మరియు వి ఎఫ్ ఎక్స్ కార్యక్రమాలే అని అంటున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా మలిచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు ఇప్పటికే ఈ చిత్రం జాతీయ మీడియాని ఆకర్షించింది.

తాజా వార్తలు