ప్రారంభమైన ఇద్దరమ్మాయిలతో ఎడిటింగ్

allu-arjun-iddarammayilatho
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ సినిమా మొత్తాన్ని డిజిటల్ ఫార్మాట్ లో తీస్తున్నారు, షూటింగ్ తో పాటే ఈ సినిమా ఎడిటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అమలా పాల్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో అల్లు అర్జున్ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు.

Exit mobile version