అక్కడ దూకుడు పెంచిన ‘డ్యూడ్’..!

అక్కడ దూకుడు పెంచిన ‘డ్యూడ్’..!

Published on Oct 19, 2025 1:00 AM IST

Dude-Movie

తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి సందడి చేస్తోంది. దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పిస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు జనం థియేటర్లకు వెళ్తున్నారు.

ఇక ఈ సినిమా బుక్ మై షోలో అధిక సంఖ్యలో టికెట్ బుకింగ్స్ జరుపుకుంటూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా 550K కి పైగా టికెట్ బుకింగ్స్ జరిపినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్‌లోనూ దూసుకెళ్తోంది.

ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 350K డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు