తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన రీసెంట్ మూవీ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్‌తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో మిక్సిడ్ టాక్ వచ్చినా, ఓటీటీలో మాత్రం ఆడియన్స్ సూపర్ అని అంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
ఇక ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.


