గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు నిశ్శబ్దంగా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే సబ్జెక్ట్‌ను ఎంతో అందంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అదే స్థాయిలో అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌కి నా అభినందనలు” అన్నారు.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ.. “మా సినిమా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఆశీస్సులు మాకు మరింత నమ్మకం, ఉత్సాహం ఇచ్చాయి. అదే ఉత్సాహంతో సినిమాను అద్భుతంగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం” అన్నారు.
నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ.. “‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. జీవిత సత్యాలతో మిళితమైన ఈ భావోద్వేగ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మా టీమ్ ప్రతీ సభ్యుడు అద్భుతంగా పని చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయేలా అవుతుందనే నమ్మకం మాకు ఉంది” అని తెలిపారు.