‘కృష్ణం వందేజగద్గురుం’ సినిమాలో నటించిన రానా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. అతనికి ఇప్పుడు ఒక కమర్షియల్ హిట్ చాలా అవసరం.
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలే కాక ఇప్పుడు ‘కవచం’ అనే సినిమాలో ప్రధానపాత్ర పోషించడానికి అంగీకరించాడు. ఈ సినిమాను గతంలో ‘అందాల రాక్షసి’ సినిమాని తెరకెక్కించిన
హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, హింది బాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ కు గానూ బాలీవుడ్ కు చెందిన అమ్మాయిని వెతికే పనిలో వున్నారు.
ఈ సినిమాకు చెందిన మిగిలిన తారల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.