నాయక్ డబ్బింగ్ స్టార్టయింది

నాయక్ డబ్బింగ్ స్టార్టయింది

Published on Nov 19, 2012 6:12 PM IST


రామ్ చరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ‘నాయక్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ కావచ్చింది. ఈ నెలాఖరు వరకు క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్లో పాటల చిత్రీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకి సంభందించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోలో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నెల 10వ తారీఖున ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు చిత్ర లోగోని కూడా ఆవిష్కరించనున్నారు. జనవరి 9 లేదా 11న సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు