డమరుకం ఆడియో లాంచ్ లో సందడి చేయనున్న దేవీ శ్రీ

డమరుకం ఆడియో లాంచ్ లో సందడి చేయనున్న దేవీ శ్రీ

Published on Sep 10, 2012 12:27 PM IST

ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ‘కింగ్’ నాగార్జున నటించిన ‘డమరుకం’ సినిమా ఆడియో వేడుకకి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఈ రోజు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ వేడుకలో దేవీ శ్రీ తన టీంతో కలిసి లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం చేయనున్నారు. దేవీ శ్రీకి 2012 చాలా ప్రత్యేకమైనది గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ మరియు ‘జులాయి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న దేవీ శ్రీ అదే జోరుతో ‘డమరుకం’ ఆల్బంతో మళ్ళీ మన ముందుకు రానున్నారు. ‘డమరుకం’ దేవీ శ్రీ సంగీతం అందించిన 50వ సినిమా కావడం విశేషం.

నాగార్జున మరియు యోగా బ్యూటీ అనుష్క జంటగా నటినచిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 19కి వాయిదా పడింది. ఈ చిత్రంలో సుమారు 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉండటం వల్ల ఎక్కువకాలం ప్రొడక్షన్ దశలోనే ఉంది.

తాజా వార్తలు