షూటింగ్ ముగించుకున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘దృశ్యం 3’

షూటింగ్ ముగించుకున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘దృశ్యం 3’

Published on Dec 2, 2025 9:00 PM IST

Drishyam-3

మలయాళ హీరో మోహన్ లాల్ నటించిన క్లాసిక్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం-2’ కూడా భారీ జనాధరణ పొందింది. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘దృశ్యం-3’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జరుగుతుండగా, మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘దృశ్యం-3’ మూవీ షూటింగ్ ముగిసిందని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఇక చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పారు. ఈ అప్డేట్‌తో అభిమానుల్లో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, బాలీవుడ్‌లో అజయ్ దేవ్గన్ రీమేక్ చేయనున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు