‘వార్ 2’లో చిన్న తారక్ నటుడు ఎవరో కాదు!

‘వార్ 2’లో చిన్న తారక్ నటుడు ఎవరో కాదు!

Published on Aug 16, 2025 7:01 AM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ సహా బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి భారీ వసూళ్లు అందుకున్న బాలీవుడ్ చిత్రమే వార్ 2. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో లీడ్ హీరోస్ నడుమ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది.

అయితే ఇద్దరు హీరోస్ కి చిన్ననాటి నటులుగా ఇద్దరు బాలురు కనిపించారు. మరి వీరిలో హృతిక్ కంటే తారక్ రోల్ ని చేసిన బాల నటుడుకి మంచి మార్కులు పడ్డాయి. తన యాటిట్యూడ్ అంతా బాగా వర్క్ అయ్యింది. అయితే చాలా వరకు తెలుగు ఆడియెన్స్ కి కూడా ఈ పిల్లాడిని ఎక్కడో చూసామే.. అనే భావన వచ్చి ఉండొచ్చు.

అవును మీరు డెఫినెట్ గా చూసారు. ఒక ఎనిమిదేళ్ల కితంకి వెళితే ఓ కమర్షియల్ యాడ్ లో ఈ పిల్లాడు కనిపించాడు. పోరా పో.. పోర్ రబ్ పోర్ అంటూ ఓ సర్ఫ్ యాడ్ కనిపించి బాగా వైరల్ అయ్యిన చిన్న పిల్లాడే ఇప్పుడు యంగ్ టైగర్ కి అగ్రెసివ్ వెర్షన్ లో కనిపించి ఇంప్రెస్ చేసాడు. అన్నట్టు ఈ యంగ్ నటుడు పేరు హార్టీ సింగ్. వార్ 2 లో మాత్రం తన పెర్ఫామెన్స్ తో అందరి దగ్గర మంచి మార్కులు తను అందుకున్నాడు.

తాజా వార్తలు