కొన్నేళ్లుగా వరుస విజయాలు నమోదు చేస్తూ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ లో హీరోగా అవకాశం దక్కించుకొని పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశారు. ఈ చిత్రంలో ఆయన కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కూడా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతల ఆలోచన.
ఐతే ఎన్టీఆర్ కొరెంటైన్ సమయంలో ఇంటిలో ఉంటూనే కొందరు దర్శకుల నుండి కథలు వింటున్నాడని తెలుస్తున్నది. అలాగే ఈ సారి ఆయన పొరుగు పరిశ్రమలలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ తో కమిటై అయ్యే సూచనలు కనబడుతున్నాయి. నిజానికి సౌత్ లో స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న యంగ్ డైరెక్టర్ అట్లీ, ప్రశాంత్ నీల్ లలో ఎవరో ఒకరితో ఎన్టీఆర్ మూవీ చేస్తారు అనుకున్నారందరు. ప్రశాంత్ నీల్ తో అయితే ఆల్మోస్ట్ మూవీ కన్ఫర్మ్ అన్నారు. కానీ త్రివిక్రంతో ఆయన మూవీ ప్రకటించారు. ఐతే ఎన్టీఆర్ తన 31వ చిత్రం మాత్రం వీరిద్దరిలో ఒకరని తెలుస్తుంది.