స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల చేయబోయే సినిమా ఎవరితో అని ఫ్యాన్స్ లో ఇప్పటికే చర్చ మొదలైపోయింది. ఏ స్టార్ హీరోతో కొరటాల ప్లాన్ చేస్తున్నాడో తెలిసిపోయింది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ తో సినిమా తర్వాత కొరటాల, ఎన్టీయార్ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. 2021లో ఈ చిత్రం మొదలవనుందని ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఐతే ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో ప్రముఖంగా వినిపించే పేరు కొరటాల శివ. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే చోటా హీరోల దగ్గర నుంచి ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ వరకు ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక కొరటాల మరో ఐదారు చిత్రాలు తరువాత దర్శకత్వం నుండి తప్పుకుంటాడని కూడా వార్తలు వస్తున్నాయి.