ఎన్టీఆర్ కొడుకు వదిలితే దున్నేసేలా ఉన్నాడట..!

ఎన్టీఆర్ కొడుకు వదిలితే దున్నేసేలా ఉన్నాడట..!

Published on Mar 10, 2020 1:54 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు కుటుంబంతో కలిసి హోళీ వేడుకలలో పాల్గొన్నారు. ట్విట్టర్ వేదికగా అందరికీ హోళీ శుభాకాంక్షలు కూడా చెప్పారు. అలాగే తన క్యూట్ ఫ్యామిలీ ఫోటోని ఆయన షేర్ చేశారు. ఆ ఫొటోలో భార్య లక్ష్మీ ప్రణతి తో పాటు, పెద్ద కొడుకు అభయ్ రామ్, చిన్న కొడుకు భార్గవ్ రామ్ కూడా ఉన్నారు. రెండేళ్లు కూడా నిండని భార్గవ్ రామ్ స్మైలింగ్ పేస్ తో చక్కగా కెమెరా కు పోజిచ్చాడు. ఈ ఫోటో ట్యాగ్ చేస్తూ దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరంగా స్పందించారు.

చిన్నబ్బాయి కెమెరా వైపు చూస్తున్న తీరు చూస్తుంటే వదిలితే ఇప్పుడే దున్నేసేలా ఉన్నాడు అని కామెంట్ పెట్టాడు. భార్గవ్ భవిష్యత్ లో పెద్ద హీరో అవుతాడని అర్థమైపోతుంది అనే భావనలో హరీష్ కామెంట్ పెట్టడం జరిగింది. ఇక గతంలో హరీష్, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమా తెరకెక్కించడం జరిగింది.

తాజా వార్తలు