కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. వారు ప్రజల ప్రాణాలు మరియు ఆరోగ్య భద్రత కోసం రోజుల తరబడి రోడ్లపై విధి నిర్వహిస్తున్నారు. విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా నిలిచిన పోలీసులకు సెలెబ్రిటీలు తోచిన విధంగా సహకారం అందిస్తున్నారు. సినీ ప్రముఖులు వారి డ్యూటీ నిర్వహణకు అవసరమైన మాస్క్ లు, శానిటైజర్స్, గ్లోవ్స్ డొనేట్ చేస్తున్నారు.
తాజాగా హరీష్ శంకర్ పోలీసులకి 2500 హ్యాండ్ శానిటైజర్స్ అందించారు. వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఈ సందర్భంగా హరీష్ శంకర్ తెలిపారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న కార్మికులకి తన వంతు సాయం అందించారు హరీష్. సురభి గ్రూప్ వాళ్లకు డైరెక్టర్ హరీష్ శంకర్ సరుకులు పంపణీ చేశారు. అందరికీ 81 బ్యాగులు అందించారు. ఇలాంటి పరిస్థితుల్లో కళాకారులను ఆదుకున్నందుకు సురభి డ్రామ గ్రూప్ ధన్యవాదాలు తెలియజేసిన సంగతి తెలిసిందే.