రామ్ చరణ్ లిస్ట్ లో ఆ దర్శకుడు కూడా ఉన్నాడట.

రామ్ చరణ్ లిస్ట్ లో ఆ దర్శకుడు కూడా ఉన్నాడట.

Published on Mar 8, 2020 10:14 PM IST

మళ్ళీ రావా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. గత ఏడాది నాని హీరోగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను కదిలించి వేసింది. నాని కెరీర్ లో ఓ బెస్ట్ మూవీగా జెర్సీని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతుంది. జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు.

కాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ కొత్త స్టోరీని హీరో రామ్ చరణ్ కి వినిపించాడట. ఓ భిన్నమైన క్యూట్ లవ్ స్టోరీని గౌతమ్, చరణ్ కి వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాదాపు మరో ఏడెనిమిది నెలలు ఆయన ఫ్రీ కాడు. అలాగే ఈ చిత్రం తరువాత చరణ్ ఏ దర్శకుడితో చేస్తాడనేది డిసైడ్ కాలేదు .

తాజా వార్తలు