‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బోయపాటి శ్రీను బాలయ్య సినిమా కోసం చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కాగా ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాలో యాక్షన్ సీన్స్ అండ్ మెయిన్ ఎమోషన్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమేనని.. అందుకే బోయపాటి, బాలయ్యతో చేస్తోన్న సినిమాలో యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సినిమాలో యాక్షన్ కంటే కూడా ఎమోషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట బోయపాటి. మెయిన్ గా బాలయ్య రెండు క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ ఎమోషనల్ గా ఉంటుందట.
ఇక కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్ సిటీలో తరువాత షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంభందించిన అప్ డేట్ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ కథానాయకిగా నటిస్తోంది.