బ్లాక్ బస్టర్ డైరెక్టర్ జంధ్యాల సినిమాలు చూస్తున్నారట

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ జంధ్యాల సినిమాలు చూస్తున్నారట

Published on Apr 17, 2020 1:02 PM IST

దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. 2019కి ఎఫ్ 2తో హిట్ అందుకున్న ఆయన ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన రైటర్స్ డిపార్ట్మెంట్ కలిసి సొంత ఊరిలో ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అనిల్ రావిపూడి అక్కడ ఇరుక్కు పోయినట్లు తెలుస్తుంది.

కాగా అనిల్ రావిపూడి తీరిక సమయంలో జంధ్యాల చిత్రాలు చూస్తున్నారట. ఆయన నెక్స్ట్ మూవీకి మంచి కామెడీ సిద్ధం చేయడం కోసం స్ఫూర్తిగా ఆయన జంధ్యాల చిత్రాలు వరుసగా చూస్తున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామాగా జంధ్యాల చిత్రాలను చెవుతారు. కామెడీ చిత్రాల తెరకెక్కించడంలో లెజెండరీ దర్శకుడిగినా జంధ్యాలకు పేరుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు