రెండు బడా హీరోల చిత్రాలను వెనక్కు నెట్టి ఎఫ్2 చిత్రంతో 2019 సంక్రాతి విన్నర్ గా నిలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన ఈ కామెడీ మల్టీ స్టారర్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. దీనితో ఎఫ్ 2 కి సీక్వెల్ తీస్తానని అనిల్ చాల కాలం క్రితమే ప్రకటించారు.ఎఫ్2 కి సీక్వెల్ గా రానున్న ఎఫ్3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సీక్వెల్ లో నటించే హీరోల విషయంలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఎఫ్2లో ఇద్దరు హీరోలను పెట్టిన అనిల్ రావిపూడి, ఎఫ్ 3 లో ముగ్గురు హీరోలతో తీయనున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు అనిల్. మూడో హీరో ఉంటాడో లేదో స్క్రిప్ట్ పూర్తిగా రాసిన తరువాత తెలుస్తుంది. అలాగే ఎఫ్ 2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ ఎఫ్ 3 లో నటించరు అనే వార్తలలో కూడా నిజం లేదన్నారు. ఎఫ్ 3లో ఖచ్చితంగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా చేస్తారు అని ఆయన స్పష్టత ఇచ్చారు. దీనితో హీరోల సంగతి ఎలా ఉన్నా, ఎఫ్ 3లో హీరోయిన్స్ ఎవరనేది స్పష్టం అయ్యింది.