మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో శంకర్ సినిమా కూడ ఒకటి. శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ఖాయమని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. త్వరలోనే ఈ సినిమా విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో కోలాహలం నెలకొంది.
శంకర్ సినిమాల్లో తమ అభిమాన హీరోను చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. అయితే శంకర్ చేసేదే ఏడాదికి ఒక సినిమా. కాబట్టి అందరు స్టార్ హీరోలకు ఆ అవకాశం రాకపోవచ్చు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు చరణ్ కు వచ్చింది. ఇక శంకర్ సినిమా అంటే ఎలాగూ భారీ బడ్జెట్ సినిమా అనేది ఖాయం. అందుకే వీరి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని కూడ వార్తలొస్తున్నాయి. గతంలోనే దిల్ రాజు శంకర్ తో సినిమా చేయాల్సింది. ‘ఇండియన్ 2’ నిర్మాణంలో ఆయన కూడ పాలుపంచుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ డ్రాప్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు చరణ్ సినిమాను దిల్ రాజే నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో చూడాలి.