ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేస్తామని ఆయన ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ అన్నారు. నవంబర్లో షూటింగ్ పూస్తి చేసి అదే నెలలో ఆడియో విడుదల చేసి డిసెంబర్లో సినిమాని విడుదల చేస్తామని అన్నారు. విక్టర్ట్ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖుల నుండి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకు జోడీగా సమంత, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్, మహేష్ తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్, జయసుధ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.