ఆంద్ర ప్రదేశ్లో విడుదల కాబోతున్న ‘డై హార్డ్ 5.0’

Die-Hard

ఐకానిక్ డై హార్డ్ ఫ్రాంచైజ్, డై హార్డ్ 5.0 మరో భాగం బ్రూస్ విల్ల్స్ మళ్ళీ రాబోతుంది. డై హార్డ్ లోని అద్బుతమైన వేటాడే సీన్స్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులు ఈ వీకెండ్లో స్క్రీన్ ఫై చూడబోతున్నారు. ఈ సినిమా అంతట డీసెంట్ గా విడుదలవుతుంది. ఈ సినిమాను తెలుగులోకి అనువదించి ఈ శుక్రవారం విడుదల చేయనున్నారు. బ్రూస్ విల్ల్స్ సినిమాకి జాన్ మోర్ డైరెక్టర్. ఈయన ‘బిహిండ్ ఎనిమీ లైన్స్’, ‘మాక్స్ పెయిన్’, మరియు ‘ద ఓమెన్’ వంటి ఫేమస్ సినిమాలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 92 మిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమా సౌండ్ ను డాల్బీ లేటెస్ట్ ఆట్మస్ సరౌండ్ సిస్టం ఫార్మటుతో కలిపి చాలా అద్బుతంగా తీశారు.

Exit mobile version