తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం ఇడ్లీ కడాయ్ తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్‌తో అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో థనుష్ రెండు వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ దక్కింది.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను అక్టోబర్ 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించగా అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, సముధ్రఖని, రాజ్‌కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
