కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా నిత్యా మీనన్ అలాగే షాలిని పాండే హీరోయిన్స్ గా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే ఇడ్లీ కొట్టు. ఈ అక్టోబర్ 1న రిలీజ్ అయ్యిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. కుబేర లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా అండర్ పెర్ఫార్మన్స్ చూసింది.
ఇక ఇలా ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి సినిమా అందుబాటులో వచ్చేసింది. అప్పుడు మిస్ అయ్యినవారు ఈ సినిమా ఇప్పుడు తప్పకుండా చూడవచ్చు. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించారు అలాగే రాజ్ కిరణ్, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
