దమ్ము మొదటి వారంలో భారీ షేర్


బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ గత శుక్రవారం విడుదలై మొదటి రోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ క్రమేనా అది బలపడుతూ ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఆదరణతో కలెక్షన్స్ బావున్నాయి. ఈ చిత్ర కె.ఎస్ రామారావు సమాచారం ప్రకారం దమ్ము మొదటి వారానికి గాను ఆంధ్రప్రదేశ్లో 24 కోట్లు షేర్ వసూలు చేయగా, ప్రపంచవ్యప్తంగా 31 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించారు. ఈ మొత్తం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్ర సక్సెస్ పురస్కరించుకొని నిన్న ఈ చిత్ర సకేస్ మీట్ ఏర్పాటు చేయగా దాసరి నారాయణరావు, ఎన్టీఆర్, దిల్ రాజు, కార్తీక, బోయపాటి శ్రీను, కె.ఎస్ రామారావు, వల్లభ మరియు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇండస్ట్రీని వేధిస్తున్న పైరసీ భూతాన్ని ఎలాగైనా అరికట్టాలనీ, పిరచి చేసే వాళ్ళని ఏమీ చేయలేకపోతున్న, కనీసం ప్రేక్షకులైన వాటిని చూడకుండా థియేటర్లో చూడాలని కోరుకున్నారు.

Exit mobile version