అభిమానులను ఉర్రూతలూగించనున్న గబ్బర్ సింగ్ ఆడియో

అభిమానులను ఉర్రూతలూగించనున్న గబ్బర్ సింగ్ ఆడియో

Published on Apr 11, 2012 9:27 AM IST


తెలుగు సంగీతాభిమనులకి పరిచయం అక్కర్లేని పేరు దేవి శ్రీ ప్రసాద్. అతను గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాకి ఇచ్చిన పాటలు ఎంతటి విజయాన్ని అందించాయో మనకు తెల్సిందే. మళ్లీ వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘గబ్బర్ సింగ్’ పాటలు త్వరలో విడుదల కానున్నాయి. దేవి శ్రీ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధా తీసుకొని మాస్ అభిమానుల్ని అలరించేలా మాస్ బీట్స్ ఇచ్చారని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేత ‘మందు’ అనే పాట పడరాని సమాచారం. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్న బీట్ పాడిన విషయం తెల్సిందే. ఈ పాట కూడా అదే స్థాయిలో అలరిస్తుందని సమాచారం. అలాగే ‘కెవ్వు కేక’ అనే ఐటెం సాంగ్ కూడా చాలా బావుందని వీటితో పాటుగా నువ్వు లేకపోతే నా లైఫ్ వేస్ట్ అనే పాటలు కూడా చాలా బావున్నాయని సమాచారం. ఈ గబ్బర్ సింగ్ ఆడియో ఏప్రిల్ 15న అభిమానుల సమక్షంలో శిల్ప కళా వేదికలో విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నారు.

తాజా వార్తలు