స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన మ్యాజికల్ కాంబో సుకుమార్ తో “పుష్ప” అనే హ్యాట్రిక్ చిత్రాన్ని మొదలు పెట్టేసి షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం అనంతరం స్టైలిష్ స్టార్ మరో బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఇంకో పాన్ ఇండియన్ సినిమాను లైన్ లో పెట్టారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులగా ఓ బజ్ వినిపిస్తుంది.
ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారు అన్నది హాట్ టాపిక్ అవుతుంది. అయితే మొదట ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మనే సంగీతం ఇస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు దేవి పేరు కూడా వినిపిస్తుంది. ఇపుడు కొరటాల మెగాస్టార్ చేస్తున్న “ఆచార్య”కు మాత్రమే తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిని పక్కన పెట్టి మణిశర్మతో చేసారు. ఇక్కడ దీని తర్వాత బన్నీతో చేయనున్న ప్రాజెక్ట్ కు మాత్రం ఇపుడు దేవి పేరు కూడా అండర్ లో ఉన్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.