మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అంటే సంగీతం మీద ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. అందులోనూ సంగీత కళాకారులకు మరింత గౌరవం ఉంటుంది ఆయన్ని కలవడమే మహాభాగ్యంగా భావిస్తారు. అలాంటి అభిమానుల్లో ఒకరయిన దేవిశ్రీ ప్రసాద్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఇళయరాజా చేసిన చిన్న సైగ ఈ సంగీత దర్శకుడి సంతోషానికి కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే లక్ష్మి మంచు “గుండెల్లో గోదారి”కి తమిళ రూపం “మరంతేన్ మన్నితేన్” ఆడియో ఈరోజు విడుదలయ్యింది ఈ సందర్భంగా వేదిక మీద పాట పాడుతున్న ఇళయరాజా మధ్యలోతనతో కలవమని దేవిశ్రీని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నట్లు చిన్న సైగ చేశారు. ఈ విషయమయి దేవిశ్రీ “అక్కడ జరిగింది నిజంగా నమ్మబుద్ది కావట్లేదు ఇళయరాజా గారు పాట పాడుతూ నన్ను వేదిక మీదకు పిలవడం నన్ను తనతో కలిసి పాడమని చెప్పడం నిజంగా గొప్ప అనుభూతి” అని అన్నారు. మనం అభిమానించే వ్యక్తులతో వేదిక మీద ప్రదర్శన ఇవ్వడం నిజంగా గొప్ప అనుభూతి.