ట్రైలర్ రెస్పాన్స్ చూసి థ్రిల్ అయిన దేవ కట్టా

ట్రైలర్ రెస్పాన్స్ చూసి థ్రిల్ అయిన దేవ కట్టా

Published on Nov 24, 2013 6:50 PM IST

Auto-Nagar-Surya
అక్కినేని నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి డైరెక్టర్ దేవ కట్టా థ్రిల్ అవుతున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా కనిపించనుంది.

దేవ కట్టా ఫాన్స్, అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ విషయంలో ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే వారు ఇస్తున్న సపోర్ట్ కి కృతఙ్ఞతలు చెప్పారు. ఈ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్స్ మరియు నాగ చైతన్య మాస్ లుక్ సినీ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఈ సినిమా చాలా కాలం వాయిదా పడింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ ఆయినా తర్వాత ఈ సినిమాపై అనచానాలు మరింత పెరిగిపోయాయి.

ఈ సినిమా ఆటో మొబైల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ మూవీలో నాగ చైతన్య సిస్టం ని మార్చేయాలనుకునే యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో కనిపించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాని అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు