గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో బందులు జరుగుతున్నందు వల్ల థియేటర్లు అక్కడక్కడా మూత పడినప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్రం మాత్రం నైజాంలో మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ఈ చిత్రం సోమవారం ముగిసే సరికల్లా ఒక్క నైజాంలోనే 5 కోట్లా 40 లక్షల షేర్ సంపాదించింది. ఈ సినిమాకి వచ్చిన మంచి స్పందనే ఇలాంటి కలెక్షన్లను తెచ్చిపెడుతోంది.
ఈ చిత్రం మొదటివారం పూర్తయ్యే సరికల్లా 8.5 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు, రెబల్ స్టార్ కృష్ణం రాజు మరియు దీక్షా సేథ్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై నిర్మించారు.