దసరా రేసులో ‘దేనికైనా రెడీ’

దసరా రేసులో ‘దేనికైనా రెడీ’

Published on Oct 6, 2012 8:10 PM IST


మంచు విష్ణు తన కొత్త సినిమా ‘దేనికైనా రెడీ’ దసరా రేసులో నిలిచింది. గతంలో సీమ టపాకాయ్, సీమ శాస్త్రి వంటి సినిమాలని తెరకెక్కించిన జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విష్ణు గతంలో నటించి సూపర్ హిట్ అయిన ‘ఢీ’ సినిమా తరహాలోనే ఈ సినిమాని కూడా యాక్షన్ విత్ 100% ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించారు. విష్ణు సరసన హన్సిక నటించిన ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై ఎమ్. మోహన్ బాబు గారు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా, చక్రి కలిసి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది.

తాజా వార్తలు