దేనికైనా రెడీకి రేపటితో గుమ్మడికాయ కొట్టేస్తారు

దేనికైనా రెడీకి రేపటితో గుమ్మడికాయ కొట్టేస్తారు

Published on Oct 10, 2012 3:33 PM IST


‘డీ’ సినిమాతో తొలి హిట్ అందుకొని ఆ తర్వాత యాక్షన్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపి సరైన హిట్ అందుకోలేకపోయిన హీరో మంచు విష్ణు. ఇప్పుడు మంచు విష్ణు రూటు మార్చి యాక్షన్ కి కామెడీని మిక్స్ చేసి చేసిన ‘దేనికైనా రెడీ’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి రేపటితో గుమ్మడి కాయ కొట్టేయనున్నారు. అదేనండి రేపటితో చిత్రీకరణ మొత్తం పూర్తికానుందని అర్థం. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోగా ఈ చిత్రంలో మిగిలి ఉన్న కొన్ని పాచ్ వర్క్ సన్నివేశాలను ప్రస్తుతం గంధర్వమహళ్లో షూట్ చేస్తున్నారు. ‘ రేపటితో షూటింగ్ పూర్తవుతుంది మరియు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ మంచు విష్ణు ట్వీట్ చేసారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచు విష్ణు సరసన హన్సిక హీరోయిన్ గా నటించింది. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా రెండు పాటలకి సంగీతం అందించగా, మిగిలిన పాటలు మరియు నేపధ్య సంగీతం చక్రి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై డా. మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు