ఇమ్రాన్ ఖాన్, పూర్ణ జగన్నాథన్ మరియు షెనాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఢిల్లీ బెల్లీ’ సినిమా హిందీలో 2011లో హిట్ గా నిలిచింది. అమీర్ ఖాన్ ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం యు.టి.వి మోషన్ పిక్షర్స్ వారు ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో రిమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ కి ‘సెట్టై’ అనే టైటిల్ పెట్టారు. యు.టి.వి సౌత్ హెడ్ ధనంజయన్ ఈ చిత్ర తెలుగు టైటిల్ ‘నాటీ బాయ్స్’ అని తెలియజేశారు. ఆర్య, అంజలి మరియు హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో ఆర్య మరియు అంజలి మీద ఓ పాటను చిత్రీకరించారు. త్వరలోనే ఆర్య మరియు హన్సిక పై స్విట్జర్లాండ్లో ఓ పాటను చిత్రీకరించనున్నారు.
ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మణిరత్నం శిష్యుడు కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు మరియు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘తెలుగు మరియు తమిళ భాషలకు తగ్గట్టు కథలో మార్పులు చేసాము. హిందీలో ఢిల్లీ బెల్లీ సూపర్ హిట్ అయ్యింది మరియు తెలుగులో కూడా ‘నాటీ బాయ్స్’ కూడా అంత పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాని’ ధనంజయన్ అన్నారు. ఈ సినిమాలో ప్రేమ్ జి, అలీ మరియు నాజర్ ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు.