బాబాయ్-అబ్బాయ్ మల్టీస్టారర్ ని కొట్టిపారేయలేం?

బాబాయ్-అబ్బాయ్ మల్టీస్టారర్ ని కొట్టిపారేయలేం?

Published on Jun 10, 2020 8:12 PM IST

నందమూరి అభిమానులు నేడు బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా పండగ చేసుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు కానుకగా నిన్న విడుదల చేసిన లేటెస్ట్ మూవీ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ టీజర్ పట్ల బాలయ్య ఫ్యాన్స్ పూర్తి సంతృప్తితో ఉన్నారు. బోయపాటి, బాలయ్య ఈ సారి హ్యాట్రిక్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అని వారు ఫిక్సయిపోయారు.

కాగా బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఒకటి ఉంది. బాలయ్య మరియు ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలన్నది వారి ఆశ. బాలయ్య, ఎన్టీఆర్ ఈ విషయంలో సుముఖంగా లేరని ప్రచారం జరుగుతుండగా అది నిజం కాదని నేడు తేలిపోయింది. బాలయ్య… ఎన్టీఆర్ తో చేయడానికి ఎప్పుడు సిద్దమే అని తాజా ఇంటర్వ్యూలో చెప్పగా, ఎన్టీఆర్ కి బాబాయ్ అంటే ఎంత అభిమానమో నేడు పుట్టిన రోజు శుభాకాంక్షల రూపంలో తెలియజేశారు. ఒకరిపై ఒకరికి ఇంత అభిమానమున్న వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు