అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ఆమె జాయిన్ అయ్యేది అప్పుడే..!

అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ఆమె జాయిన్ అయ్యేది అప్పుడే..!

Published on Sep 3, 2025 3:00 AM IST

AA22xA6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అట్లీ. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్లుగా చాలా మంది నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే ఓ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా, ఈ సినిమా షూటింగ్‌లో దీపికా ఎప్పుడు జాయిన్ అవుతుందనే అంశంపై తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ చిత్ర షూటింగ్‌లో దీపికా నవంబర్ నెలలో జాయిన్ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో దీపికా పలు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చేయనుందని చిత్ర వర్గాల టాక్. ఈ సినిమాలో మిగతా హీరోయిన్లు ఎవరనే విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు