ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాధించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సరైనోడు’. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని గీతా ఆర్ట్స్ బ్యానర్ భావిస్తోందట. బన్నీకి సరిగ్గా సరిపోయే మాస్ రోల్‌తో ‘సరైనోడు 2’ను ప్లాన్ చేస్తున్నారని సినీ సర్కిల్స్ టాక్. ఇక ఈ సినిమా కోసం మాస్ డైరెక్టర్ బోయపాటి మరోసారి రంగంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అటు బోయపాటి కూడా ‘అఖండ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరు ఈ సినిమాలు పూర్తి చేశాక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.