బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పడుకొనే చట్టపరమైన సమస్య ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత రమేష్ తౌరాని ఈమె పై వృత్తిపరమైన దావా వేసారు. ఆయన ప్రస్తుతం రేస్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన భారీ విజయం సాధించిన రేస్ చిత్రానికి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఈ చిత్రంలో దీపిక, సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్ అబ్రహం తో కలిసి నటించాల్సి ఉంది. అయితే దీపిక ఇటీవలే ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఆరు రోజులు షూటింగ్ జరగిన తరువాత ఇలా తప్పుకోవడం సరైనది కాదు అంటూ నిర్మాత ఆరోపిస్తున్నారు. ఆయన సి.ఐ.ఎన్.టి.ఎ.ఎ (సినీ మరియు టీవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) కి ఫిర్యాదు చేసారు. దీపిక సన్నిహితుల సమాచారం ప్రకారం ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆరు నెలలకి పైగా ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమస్య ఎటువైపు దారి తీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.
దీపిక పడుకొనే పై దావా వేసిన నిర్మాత !
దీపిక పడుకొనే పై దావా వేసిన నిర్మాత !
Published on Feb 13, 2012 11:38 AM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


