కమల్, రజిని ప్రాజెక్ట్ కోసం క్రేజీ డైరెక్టర్?

ఈ మధ్య సెన్సేషనల్ బజ్ ని క్రియేట్ చేసిన భారీ మల్టీస్టారర్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల కలయిక అని చెప్పాలి. అయితే వీరి కాంబినేషన్ కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ పేరు వైరల్ గా మారింది.

మరి ఆ దర్శకుడు ఎవరో కాదు సూపర్ స్టార్ తో ఆల్రెడీ జైలర్ లాంటి భారీ సక్సెస్ కొట్టిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అట. ఇప్పుడు జైలర్ 2 చేస్తున్న ఈ దర్శకుడు నెక్స్ట్ ప్రొజెక్ట్ గా ఆ భారీ కాంబినేషన్ టేకాఫ్ చేయనున్నట్టు ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి.

Exit mobile version