నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్కు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 8న ఈ చిత్ర టైటిల్ను రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ను ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది. సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సోహేల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.