జాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.

సమంత శర్వానంద్ ల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ జాను వచ్చే వారం గ్రాండ్ గా థియేటర్స్ లోకి రానుంది. విడుదల తేదీ దగ్గిర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన జాను ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకుంది. యూట్యూబ్ నందు ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంటుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్మాతలు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జాను ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 1న జరగనుంది. హీరో హీరోయిన్స్ తో పాటు, చిత్ర దర్శకనిర్మాతలు మరియు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

సి ప్రేమ్ కుమార్ జాను చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. గోవింద్ వసంత్ అందించిన సాంగ్స్ ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకున్నాయి. శర్వానంద్ ఈ చిత్రంలో వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ పాత్ర చేస్తున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేశారు.

Exit mobile version