‘శ్రీ రామరాజ్యం’ లాంటి భక్తిరస చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యలమంచలి సాయిబాబు మొదటి సినిమాతోనే నిర్మాతగా అందరి ప్రశంశలు అందుకున్నాడు. ఆయన ద్వితీయ యజ్ఞంగా దర్శకేంద్రుడు కె. రాఘవంద్రరావు దర్శకత్వంలో ‘ఇంటింటా అన్నమయ్య’ అనే సినిమాని తీసారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న భారీగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా యలమంచలి సాయిబాబు తన కుమారుడు రేవంత్ ని హీరోగా తెలుగువారికి పరిచయం చేస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.
ఈ సినిమా తర్వాత చేయనున్న సినిమాల గురించి యలమంచలి సాయిబాబుని అడిగితే ‘ నాకు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. నా తదుపరి సినిమా దాసరి గారి దర్శకత్వంలో ఉంటుంది. ఈ సినిమాకి ‘పితృదేవోభవ’ అనే టైటిల్ ని ఖరారు చెసాము. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని’ ఆయన సమాధానం ఇచ్చారు. ముందుగా యలమంచలి సాయిబాబు గారు తన ద్వితీయ యజ్ఞమైన ‘ఇంటింటా అన్నమయ్య’తో సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.