సంచలనాత్మక విమర్శలు చేసిన దాసరి

సంచలనాత్మక విమర్శలు చేసిన దాసరి

Published on Dec 21, 2012 1:30 AM IST


ప్రముఖ దర్శకుడు “దర్శకరత్న” డా. దాసరి నారాయణ రావు ఈరోజు కొన్ని సంచలనాత్మక విమర్శలతో ఫిలిం నగర్లో చర్చనీయాంశం అయ్యారు. ఇక్కడ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అయన చేసిన కామెంట్ లు చర్చనీయాంశం అయ్యాయి. “తెలుగు పరిశ్రమలో సెలెబ్రిటిల గురించి ఒక పుస్తకం రాస్తాను అందులో వారి నిజమయిన చరిత్ర ఏంటో రాస్తాను. నేనే చాలా మందికి జీవితాన్ని ఇచ్చాను, ఈరోజు వారు తగిన మర్యాద ఇవ్వకపోగా,నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు” అని అన్నారు.

ప్రస్తుత చిత్రాలలో స్క్రీన్ప్లే గురించి దాసరి ఇలా అన్నారు ” ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలలో క్రియేటివిటీ కనిపించడం లేదు. నేను నేరుగా ఛాలెంజ్ చేస్తున్న రజినీకాంత్ “భాషా” చిత్ర ఛాయలు లేకుండా ఇప్పుడు చిత్రాలను చెయ్యగలరా? ఈ ఛాలెంజ్ సంక్రాంతికి రానున్న చిత్రాలకు కూడా వర్తిస్తుంది” అని అన్నారు.

దాసరి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారని ఫిలిం నగర్లో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు