నూతన తారలు రోహిత్ రెడ్డి, రాజ్ అర్జున్, కృతిక, నేష్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన తుమ్మ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘దిల్ దివానా’. ఈ శుక్రవారం అనగా ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. రామ్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని శ్రీ భావన ఫిల్మ్స్ బ్యానర్ పై రాజారెడ్డి నిర్మించారు.
స్పెషల్ గా ఈ సినిమా చూసిన దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు ఇంగ్లీష్, హిందీ టైటిల్స్ చూసి బాధేస్తోంది. కానీ ఈ సినిమా చుసిన తర్వాత దిల్ దివానా టైటిల్ కథకి పర్ఫెక్ట్ అనిపించింది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లోలా భుతు డైలాగ్స్, భూతు సీన్స్ లేకుండా ఈ సినిమాని తీసారు. ఒకప్పుడు మేము ఓక ఫీల్ తో ప్రేమకథలు చేసే వాళ్ళం అందుకే అవి హిట్ అయ్యాయి. మళ్ళీ ఆ ఫీల్ ని ఈ సినిమాలో చూసాను. నెక్స్ట్ జనరేషన్ లైలా మజ్ను ‘దిల్ దివానా’ అవుతుంది. ఇదొక ఫీల్ గుడ్ మూవీ’ అని అన్నాడు.