చేసే వారికే ఆ కష్టం తెలుస్తుందంటున్న చెన్నై ముద్దుగుమ్మ

చేసే వారికే ఆ కష్టం తెలుస్తుందంటున్న చెన్నై ముద్దుగుమ్మ

Published on Oct 10, 2012 11:39 AM IST


తమిళ ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, క్యూట్ స్మైల్ మరియు అభినయంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. మొదట్లో చాలా సున్నితంగా ఉండే పాత్రల్లో మరియు రొమాంటిక్ పాటల్లో హీరోల సరసన ఆడిపాడిన సమంత ఖచ్చితంగా మాస్ హీరొయిన్ గా పేరుతెచ్చుకుంటుంది. ఇలాంటి ఇమేజ్ వచ్చినప్పుడు ఎంతో జోష్ తో మాస్ పాటల్లో డాన్స్ చేయాల్సిన అవసరం వుంటుంది.

ఈ విషయం సమంతని కొంత బాధకి గురిచేస్తోంది. ‘ తెరపైన వచ్చే మాస్ పాటలని చూసే వారు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ డాన్సర్లకి ఎంత కష్టంగా ఉంటుందో అనేది వారికి తెలియదు, అనుభవించే వారికే అది తెలుస్తుంది. ఉదాహరణకి ‘దూకుడు’ సినిమాలో చేసిన ‘దేతడి దేతడి’ పాట చూసి అందరూ చాలా థ్రిల్ అయ్యారు కానీ దానికోసం ఎంత కష్ట పడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు’ అని ఆమె అన్నారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ – సమంత జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ఒక మాస్ పాటకి స్టెప్పులేసారు. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు