హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్

హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్

Published on Feb 21, 2012 12:24 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ షెడ్యుల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ఈ నెల 24 న హైదరాబాదుకి తిరిగిరానుంది. ఈ షెడ్యుల్లో చిత్ర యూనిట్ పలు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది. ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని యూనిట్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక మరో హీరొయిన్ నటిస్తుంది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు