‘కింగ్’ అక్కినేని నాగార్జున మొట్టమొదటి సరిగా చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకా ఈ చిత్రంలో ఏమి కట్స్ విదించారు అనేది ఇంకా తెలియలేదు. ‘డమరుకం’ ఈనెల 19 న విడుదల కావడానికి సిద్దమవుతోంది.
శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటించారు. సుమారు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్లో జరగనుంది. ఈ సినిమా కంటే ఒక రోజు ముందు అనగా అక్టోబర్ 18న పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదల కానుంది.