నక్సల్స్ నేపధ్యంలో నవీన్ చంద్ర “దళం”

నక్సల్స్ నేపధ్యంలో నవీన్ చంద్ర “దళం”

Published on Oct 9, 2012 10:05 PM IST


“అందాల రాక్షసి” చిత్రంతో మంచి పేరుని సంపాదించుకున్న నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో “దళం” అనే పేరుతో ద్విభాషా చిత్రం రాబోతుంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడయిన జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం నక్సల్స్ ఆధారితమయిన కథతో తెరకెక్కించబడుతుంది. ఎం సుమంత్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన బాగా చిత్రీకరణ చివరి దశల్లో ఉంది ప్రస్తుతం నవీన్ చంద్ర ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలు పెట్టేసారు. ఈ చిత్రంలో పియ బాజ్పాయి కూడా నటిస్తుంది. “బన్ని” మరియు “భీమిలి కబడ్డీ జట్టు” చిత్రంలో విలన్ పాత్ర పోషించిన కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జేమ్స్ వసంతన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా హైదరాబాద్,చెన్నై మరియు వైజాగ్ లలో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో నవంబర్లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు